అరవింద సమేత: పాట హిట్.. కానీ సినిమాలో ఫ్లాప్..!

134

అరవింద సమేత సినిమాలో పెనివిటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆడియోలో ఆపాట హృదయాన్ని బరువెక్కించేసింది. అయితే ఈ పాటని సినిమాలో ఎలా ఉండబోతుందో అని ఎక్సైటింగ్ గా ఎదురుచూశారు ప్రేక్షకులు. అయితే వారికి ఈ సాంగ్ నిరాశ కల్పించిందని చెప్పొచ్చు. ఈ సాంగ్ కు రెండు వర్షన్ లో పాడించిన త్రివిక్రం పాతో సాంగా ఎందుకు కాదన్నాడో తెలియదు కాని గతం గుర్తు చేసుకుంటూ ఎన్.టి.ఆర్ ఆ పాట పాడటం అసలేం బాగాలేదు.

అంతేకాదు ఈ పాటకు రెండు స్టెప్స్ కూడా ఎన్.టి.ఆర్ వేస్తాడు. వెనుకాల షార్ట్స్ వేసుకుని అమ్మాయిలు కనిపిస్తారు. అసలు ఈ పాట ఇలా చేసి ఉండాల్సింది కాదు అని కొందరి వాదన. మరి రెండో వర్షన్ పాడించిన త్రివిక్రం దాన్ని సినిమాలో పెడితే బాగుండేమో అనుకుంటున్నారు. ఏది ఏమైనా అరవింద సమేత సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ మరోసారి బాక్సాఫీస్ మీద తన సత్తా చాటుతున్నాడు.

Leave a comment