Gossipsఆరెక్స్ పాపకు ప్రభాస్ కావాలట..!

ఆరెక్స్ పాపకు ప్రభాస్ కావాలట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు హీరోయిన్స్ కు కూడా అతనంటే ఇష్టమే. ప్రభాస్ తో జోడీ కట్టే ఛాన్స్ వస్తే ఏ ఒక్క హీరోయిన్ కూడా వదులుకునే అవకాశం లేదు. అతని ఛాన్స్ రావాలే కాని ఎగిరిగంతేసే హీరోయిన్స్ ఉన్నారు. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ సూపర్ హాట్ అంటూ తనతో ఛాన్స్ వస్తే చాలని అంటుంది ఆరెక్స్ 100, ఆర్.డి.ఎక్స్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

తన ప్రతి సినిమాలో ఫ్యాన్స్ ను ఏమాత్రం డిజప్పాయింట్ చేయని ఈ అమ్మడు ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమాలో మరొక్కసారి రెచ్చిపోయిందని తెలుస్తుంది. ఈమధ్యనే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాయల్ ప్రభాస్ మీద తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. ప్రభాస్ లో ఎప్పుడూ ఒక స్పార్క్ కనిపిస్తుంది. అదే అతనిలో ప్లస్ పాయింట్. అంతేకాదు అతని స్టైల్, యాటిట్యూడ్ అంతా నచ్చుతుందని. ఛాన్స్ వస్తే ప్రభాస్ తో నటించేందుకు సిద్ధమని అంటుంది పాయల్.

ప్రభాస్ పాయల్ అదిరిపోయే కాంబో.. మొదటి సినిమాలోనే అందాలను గుమ్మరంచిన ఈ అమ్మడు జూనియర్ అనుష్క అంటే నమ్మాల్సిందే. అయితే అనుష్క హాట్ అప్పియరెన్స్ ఇచ్చింది కాని పాయల్ రాజ్ పుత్ లా లిప్ లాక్స్ చేయలేదు. మరి పాయల్ కోరిక ప్రభాస్ తీరుస్తాడా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news