Newsపవన్ కళ్యాణ్...దేశ్ బచావో...పాటలు విడుదల

పవన్ కళ్యాణ్…దేశ్ బచావో…పాటలు విడుదల

Pawankalyan  is going to release the music album namely Desh Bachao! to support the demand for a special status for Andhra Pradesh which is thought earlier. Click here for list of six songs below.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ దేశం మొత్తం పలుకుతున్న పేరు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తన గళాన్ని వినిపిస్తూనే మరో పక్క జనసేన పార్టీ పనులను చక్కబెడుతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకహోదా కోసం జనవరి 26 న విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు రంగం సిద్ధం చేసారు. తమిళనాడులో జల్లికట్టు కోసం తమిళులు చేసిన పోరాటమే మనము చేస్తే ప్రత్యేక హోదా సాధించవచ్చు అని భావించిన పవన్ వారి పంథాలోనే ప్రత్యేక హోదా కోసం చేపట్టిన మౌన దీక్షకు మద్దతు తెలపాలని కోరాడు. పవన్ పిలుపుకు తెలుగు ఇండస్ట్రీలోని కొందరు యువ హీరోలు వారి మద్దతును ప్రకటించడం జరిగింది.

ఈ నెల 26 న తలపెట్టిన మౌన దీక్షకు మద్దతు తెలిపే వారిని ఉత్తేజపరచడానికి ఫిబ్రవరిలో విడుదల చెయ్యవలసిన తన ఆడియో ఆల్బంని ముందుగానే విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ అనుకున్నట్టు గానే ఇవ్వాళ విడుదల చేసారు.దీనితో పాటు జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ని కూడా లాంచ్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు పవన్.

పవన్ విడుదల చేసిన ఆడియో పాటలు మీకోసం..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news