Gossipsప‌వ‌న్‌కళ్యాణ్ తో విడాకుల గుట్టు విప్పేసిన రేణు

ప‌వ‌న్‌కళ్యాణ్ తో విడాకుల గుట్టు విప్పేసిన రేణు

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్లయింది. కానీ వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. పవన్ అంటే రేణుకు ఇప్పటికీ ఇష్టమే అని.. పవనే బలవంతంగా ఆమె నుంచి విడిపోయాడన్నది స్పష్టం. ఈ విషయాన్ని రేణు మాటల్లో ఇప్పటికే విన్నాం. తాజగా ఓ ఇంటర్వ్యూలో పవన్‌తో తన బంధం గురించి రేణు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్‌తో విడిపోవడం తనకెంతమాత్రం ఇష్టం లేదని.. కానీ ఏ బంధాన్ని కూడా బలవంతంగా నిలిపి ఉంచలేమని.. కాబట్టి ఓ దశ దాటాక తాను ప్రయత్నం ఆపేయడంతో విడాకులు వచ్చేశాయని చెప్పింది రేణు. పవన్‌ నుంచి విడిపోవడం గురించి తాను ఎన్నేళ్లు బాధపడాలని.. అందుకే తాను దాని గురించి పట్టించుకోవడం మానేశానని రేణు చెప్పింది.

పవన్ నుంచి తాను ఎందుకు విడిపోయానన్నది అందరికీ మిలియన్ డాలర్ల ప్రశ్న అయిపోయిందని.. ఐతే ఆ కారణం ఏంటన్నది తాను ఇప్పుడు చెప్పలేనని రేణు తెలిపింది. ఆ విషయం ఇప్పుడు చెబితే లేని పోని సమస్యలు వస్తాయంది. కానీ ఏదో ఒక రోజు తాను ఆ విషయాలు వెల్లడిస్తానని ఆమె తెలిపింది. బహుశా తన జీవిత చరిత్రలో ఆ విషయం వెల్లడిస్తానేమో అంది.

ఇక తాను రెండో పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. ఈ విషయమై ఫేస్ బుక్‌లో ఒక పోస్టు పెట్టినందుకే చాలా గొడవ జరిగిందని చెప్పింది. తాను పెళ్లి చేసుకునే వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఓ అభిమాని అన్నట్లు ఆమె వెల్లడించింది. ఇలాంటి బెదిరింపుల వల్ల తనను పెళ్లి చేసుకోవడానికే ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి తాను ఇలా ఎన్నాళ్లు ఒంటరిగా ఉండాలని.. జీవితాంతం ఇలా ఒంటరిదానిలాగే మిగిలిపోతానేమో అని భయంగా ఉందని ఆమె చెప్పడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news