Gossipsత్రివిక్రం పవర్ స్టార్ ఫై వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే ..!

త్రివిక్రం పవర్ స్టార్ ఫై వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ అజ్ఞాతవాసి అని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందట. టైటిల్ అజ్ఞాతవాసి అని రిజిస్టర్ చేసినా అఫిషియల్ గా చెప్పకపోడానికి కారణం అజ్ఞాతవాసి అన్న టైటిల్ ప్రేక్షకుల్లో బాగా నలగాలనే అట.

సినిమా టైటిల్ గా అజ్ఞాతవాసి ఫిక్స్ అయినా అభిమానుల్లో ఆ టైటిల్ పై ఓ పాజిటివ్ బజ్ ఏర్పడే దాకా టైటిల్ రివీల్ చేయకూడదని భావించారట. అందుకే సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే టైంలోనే టైటిల్ లోగో రెడీ చేసినా రిలీజ్ చేయలేదట. ఇక అత్తారింటికి దారేది సినిమా లానే కథకు తగ్గ టైటిల్ ఇది అవుతుందని అంటున్నారు.

అయినా పవర్ స్టార్ హీరో త్రివిక్రం డైరక్షన్.. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఎలాంటి టైటిల్ పెట్టినా అది ట్రెండ్ అవడం ఖాయం టైటిల్ విషయంలో జాప్యం త్రివిక్రం ప్లానేనా కాదా అన్నది తెలియదు కాని ఇదే టైటిల్ కాకుండా వేరే టైటిల్ వస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ కచ్చితంగా హర్ట్ అవుతారని చెప్పొచ్చు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news