Newsతమన్ అదరగొట్టావ్.. పవన్ కళ్యాణ్ ట్వీట్..!

తమన్ అదరగొట్టావ్.. పవన్ కళ్యాణ్ ట్వీట్..!

అసలే అరవింద సమేత సక్సెస్ జోష్ లో ఉన్న తమన్ కు మరో సర్ ప్రైజ్ ట్వీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చింది. అరవింద సమేత సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్ ఆ సినిమా చూసిన ఆడియెన్స్ నుండి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ జనసేన కవాతు సాంగ్ కు తమన్ మ్యూజిక్ అందించాడు.

రాబోతున్న ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా జనసేన ప్రచారం కోసం ఆ పాట రాయించడం జరుగుతుంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అయితే ఆ పాట విన్న పవన్ ఇద్దరిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. థ్యాంక్స్ బ్రదర్ అంటూ తమన్ ను.. రామజోగయ్య శాస్త్రిని కూడా ప్రత్యేకంగా ఎంతో బిజీగా ఉన్నా సరే తన కోరిక మన్నించి ఈ పాటకు సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రికి కృతజ్ఞతలు తెలిపాడు పవన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news