Gossipsపవన్ అంటే భయం అంటా ఆ హీరోయిన్ ఎవరో తెలుస్తే షాకే...

పవన్ అంటే భయం అంటా ఆ హీరోయిన్ ఎవరో తెలుస్తే షాకే !

అందాల అనూఇమాన్యుయెల్ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది

తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ చిత్ర రంగాల‌లో న‌టి గా పేరుతెచ్చుకునేందుకు త‌పిస్తోంది.

ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డేందుకే ఎక్కువ మొగ్గుచూపుతోంది.

ఇందులో భాగంగానే హైద్రాబాద్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది.

ఇక త‌న తాజా సినిమా గురించి ఆమె ఏమన్న‌దంటే..‘పవన్‌కల్యాణ్‌తో నటన ఓ మంచి అనుభవం. సాధారణంగా తెలియని వారి నుంచి ఫోన్‌ వస్తే నేను తీయను. తెలియని నంబరు నుంచి ఓ రోజు ఫోను వచ్చింది. ఎందుకో తెలియదు లిఫ్ట్‌ చేశా. ‘మేం హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాం.

పవన్‌తో సినిమా చేయాలి’ అన్నారు. వెంటనే మీటింగ్‌కు వెళ్లా. పవన్‌ చెల్లెలు పాత్ర ఇస్తారనుకున్నా. కానీ కథానాయిక పాత్ర ఇచ్చారు. ఈ ఫోన్‌కాల్‌ను నేను మర్చిపోలేను’.‘ఈ సినిమా సెట్‌లో మొదట పవన్‌ని చూసినప్పుడు చాలా భయపడ్డా. ఆయన స్టార్‌ హీరో అన్న భయంతో.. తొలిరోజు సెట్‌కు వెళ్లకముందు డైలాగ్‌లు బట్టీ పట్టి వెళ్లా. అక్కడ ఆయన్ను చూడగానే అన్నీ మర్చిపోయా. కానీ పవన్‌ చాలా సరదాగా ఉంటారు. జోక్స్‌ వేసి, నవ్విస్తుంటారు. దీంతో సులభంగా ఆయనతో కలిసిపోయాను’ అనివివరించింది.

త్వ‌ర‌లో ఈమె న‌టించిన ఆక్సిజ‌న్ మూవీ కూడా విడుద‌ల‌కు సిద్ధం కానుంది. గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత ఏఎం ర‌త్నం త‌న‌యుడు ఏఎం జ్యోతికృష్ణ తెరకెక్కించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news