Gossipsపవన్ ను ఢీ కొడుతున్న నాని..!

పవన్ ను ఢీ కొడుతున్న నాని..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డీ కొడుతూ నాని ప్రస్తుతం తను నటిస్తున్న ఎం.సి.ఏ సినిమా రిలీజ్ చేస్తున్నారట. దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఎం.సి.ఏ సినిమా అసలైతే డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్ 21న అసలు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయగా అదే టైం కు అఖిల్ హలో సినిమా వస్తుండటంతో డిసెంబర్ 15కి ఫిక్స్ చేశారు.

ఇప్పుడు మళ్లీ డిసెంబర్ లో కాకుండా ఏకంగా సంక్రాంతి బరిలో ఎం.సి.ఏ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విషయంలో దిల్ రాజు తగ్గే ప్రసక్తే లేదని అంటున్నాడట. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్, త్రివిక్రం మూవీతో పాటుగా బాలకృష్ణ జై సింహా వస్తుంది. ఇదే కాకుండా రవితేజ టచ్ చేసి చూడు, రాజ్ తరుణ్ రాజు గాడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

పొంగల్ వార్ లో సత్తా చాటాలని చూస్తున్నా పవన్ త్రివిక్రం సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం మిగతా సినిమాలకు కష్టమే అని చెప్పొచ్చు. నాని సినిమాకు క్రేజ్ ఉన్నా ఓ పక్క బాలయ్య, పవన్, రవితేజలతో పోటీ ఎంతవరకు సేఫ్ అన్నది తెలియాల్సి ఉంది. మరి అఫిషియల్ గా నాని సినిమా రిలీజ్ డేట్ వచ్చేదాకా ఈ కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news