Movies‘కాటమరాయుడు’ కొత్త పోస్టర్ : దుమ్ములేపిన పవన్ కళ్యాణ్

‘కాటమరాయుడు’ కొత్త పోస్టర్ : దుమ్ములేపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan’s latest movie Katamarayudu new poster has released which is designed in mass style. This photo trends in top position within a minutes after released.

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం నుండి తీసుకుంటే.. ఆయన మూవీల ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఒకే తరహాలో ఉంటాయి. నడుచుకుంటూ వస్తున్నట్లుగానీ, కోపంగా చూస్తున్నట్లుగానీ చిరునవ్వు నవ్వుతూగానీ పవన్‌ని పోస్టర్లలో చూపిస్తారు. కానీ.. ఫస్ట్‌టైమ్ వాటికి భిన్నంగా ‘కాటమరాయుడు’ చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్ ఫేస్ కనిపించదు.. సగం వరకే పంచెకట్టుతో అటు నడుస్తున్నట్లు చూపించడం జరిగింది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో దుమ్ములేస్తున్నట్లు చూపించిన విధానం అదిరింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే.. ఫ్యాన్స్‌కి పూనకం వచ్చేలా ఈ పోస్టర్‌ని డిజైన్ చేసింది చిత్రబృందం.

పవన్ ఫేస్ కనిపించకపోయినప్పటికీ.. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసింది. కొన్ని నిముషాల వ్యవధిలోనే ఈ ఫోటో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసిందంటే.. ‘కాటమరాయుడు’ మూవీపై ఏ రేంజులో క్రేజ్ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పవన్ మహిమేనని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాగా.. ఈ మూవీ నిర్మాత న్యూఇయర్ వరకు వరుసగా నాలుగు పోస్టర్లు రిలీజ్ చేస్తామని చెప్పడాన్ని చూస్తుంటే.. జనవరి 1వ తేదీనే పవన్ ఫేస్ కనిపించేలా ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసేలా ఉన్నారు. అంతవరకు ఈ తరహాలోనే పవన్ ఫేస్ కనిపించకుండా ప్రీ-లుక్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారన్నమాట. ప్రస్తుతం రిలీజైన ఫోటోతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

pawan kalyan katamarayudu new poster talk

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news