పవన్ భారీ దెబ్బకు… ఎన్టీఆర్ కు అన్యాయం..!

pawan-kalyan-ntr

త్రివిక్రం పవ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా ఇచ్చిన షాక్ తో త్రివిక్రం ప్రస్తుతం చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా అరవింద సమేతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎన్.టి.ఆర్ సినిమాకు అనవసరంగా బడ్జెట్ కేటాయించకుండా కాస్ట్ కటింగ్ చేస్తున్నారట.

ఈ క్రమంలో అజ్ఞాతవాసి లా భారీ సెట్లు, గ్రీన్ మ్యాట్ లు లాంటివి లేకుండా సింపుల్ గా కానిచ్చేస్తున్నారట. అంతేకాదు కాస్ట్ కటింగ్ లో భాగంగానే సెకండ్ హీరోయిన్ గా ఈషా రెబ్బని తీసుకున్నారని తెలుస్తుంది. సినిమా మొత్తం 70 కోట్లలోపే పూర్తి చేయాలని చూస్తున్నారట. సినిమా కూడా అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన వారికే ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

అనుకున్న బడ్జెట్ లో అనుకున్న టైంలో ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నా ఫస్ట్ లుక్ లోనే సిక్స్ ప్యాక్ తో వచ్చిన తారక్ చాలారోజుల తర్వాత కత్తిపట్టాడు కచ్చితంగా ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలవాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. కాని కాస్ట్ కటింగ్ గురించి వస్తున్న వార్తలతో సినిమా క్వాలిటీ ఏమన్నా దెబ్బతింటున్నా అని వారు ఆలోచనలో పడ్డారు.

Leave a comment