Moviesపవర్ స్టార్ క్రేజ్ కి నిలువెత్తు నిదర్సనం 

పవర్ స్టార్ క్రేజ్ కి నిలువెత్తు నిదర్సనం 

త్రివిక్రంతో చేస్తున్న పవన్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుంది. టాలీవుడ్ టాప్ చిత్రం బాహుబలిని పక్కన పెడితే ఇప్పుడు పవన్ సినిమాకి టాప్ లెవల్లో ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఉందని ఈ లెక్కన పవన్ కల్యాణే టాలీవుడ్ నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసినా పవన్ సినిమాకి ఫుల్ క్రేజ్ ఉంటుంది అంటే అది పవన్ కున్న స్టామీనానే అంటున్నారు.
ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో జత కట్టడం అంటే ఇక ఆ సినిమాకి ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో వేరే చెప్పక్కర్లేదు.ఇప్పుడు పవన్ – త్రివిక్రమ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 100  కోట్ల దగ్గర దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా బయట బిజినెస్ అలాగే వుంది. ఇక పవన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మార్క్ టచ్ చెయ్యడం మహేష్ ‘స్పైడర్’, ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ వల్ల కూడా జరగదంటున్నారు. అసలు పవన్ సినిమా బిజినెస్ ఫిగర్ దగ్గరికి కూడా ఆ సినిమాలు రావంటూ సోషల్ మీడియా లో న్యూస్ లు హల్ చల్ చేయడం విశేషమే మరి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news