జగన్ కి సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్ .. ఇది కదా కావాల్సింది.. శభాష్ అంటూ మెచ్చుకున్న కత్తి మహేష్

jagan-pai-viruchukupadda-pa

ఏపి స్పెషల్ స్టేటస్ మీద కేంద్ర వైఖరికి ఇప్పటికే ఏపిలో నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. బిజేపి మోసపూరిత వైఖరిని ఏపి సిఎం అడ్డుకట్టవేయట్లేదని ప్రతిపక్ష పార్టీ వైసిపి ఎండకడుతుంది. ఇక నిన్న ప్రజా సంకల్ప యాత్రలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతా దానికి పవన్ సపోర్ట్ ఇస్తాడా అని సవాల్ విసిరాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

అయితే ఆ సవాన్ ను స్వీకరిస్తూ తిరిగి జగన్ కు ప్రతి సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్. మార్చి 4 లోపు తన ఎంపిలలో ఒకరితో అవిశ్వాసం పెట్టండి దానికి నా పూర్తి మద్ధతు ఇస్తానని.. కావాలంటే అఖిల పక్షాన్ని కూడా సిద్ధం చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్. మీరు దమ్మున్న, ధైర్యం ఉన్న నాయకులని నాకు తెలుసు.. అది నిజం చేసేలా ఎలాంటి వెనుకడుగు లేకుండా అవిశ్వాస తీర్మానం పెట్టించండని అన్నారు పవన్.

ఇక పవన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి జగన్ కు సవాల్ విసిరాడో లేదో కత్తి మహేష్ మిస్టర్ పికే ఇది నీ నుండి మేము కోరుకునేది. ఇప్పుడు నువ్వు అసలైన ట్రాక్ లో ఉన్నావు.. దీనికి నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను.. ఏపి ఎంపిల మీద ప్రెసర్ తీసుకు రండి. అఖిల్ పక్షాన్ని కూడా సిద్ధం చేయండి అంటూ ట్వీట్ చేశాడు. ఇన్నాళ్లు పవన్ పొలిటికల్ కెరియర్ మీద ట్వీట్స్ తో టార్గెట్ చేసిన కత్తి మహేష్ జగన్ కు విసిరిన సవాల్ తో అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు.

Leave a comment