శ్రీరెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చిన పవన్..దెబ్బకు దుకాణం మూసుకుంది..!!

pk-sr

కాస్టింగ్ కౌచ్ పేరుతో నానా హంగామా సృష్టించిన సంచలనాల శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ దీనిపై ఓ కమిటీ వేసేలా చేసింది. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత పవన్ తల్లిని దూషించడంతో శ్రీరెడ్డి ఇష్యూ మరింత పెద్దదయ్యింది. శ్రీరెడ్డి గొడవలో మీడియా ఛానెళ్ల పాత్ర కూడా ఉందని ఆ ఛానెల్స్ మీద యుద్ధం ప్రకటించాడు పవన్ కళ్యాణ్.

ఓ రెండు రోజులు ఫిల్మ్ చాంబర్ దగ్గర దర్శక నిర్మాతలతో చర్చలు కూడా జరిపారు. ఇంత జరిగినా మళ్లీ సినిమా యాడ్స్ ఆ ఛానెల్స్ కు వెళ్తున్నాయి.. ఇక బహిష్కరణ మాటే లేదనుకోండి. అయితే పవన్ హంగామా వల్ల సినిమా వాళ్ల మీద అనవసర డిస్కషన్స్ మాత్రం పెట్టట్లేదు. ఇక శ్రీరెడ్డిని అయితే ఛానెల్స్ లో అడుగు కూడా పెట్టనివ్వట్లేదు. కచ్చితంగా ఇది పవన్ శ్రీరెడ్డికి ఇచ్చిన షాక్ అని చెప్పాలి.

ఇక తననెలాగు ఛానెల్స్ కు పిలవడం లేదని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద రెచ్చిపోతుంది శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో ఆమె ఎంత చించుకున్నా మీడియా ఛానెల్స్ కు ఎక్కనిదే ఆమె మీద జనాల ఫోకస్ ఏర్పడదు. అది ఎలాగు కుదరదు కాబట్టి శ్రీరెడ్డి నోరు మూయించడంలో కొంతవరకు సక్సెస్ అయినట్టే.

Leave a comment