Gossipsనిర్మాత గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పవన్..!

నిర్మాత గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం సెట్స్ మీదనే ఉంది. అసలైతే ఈపాటికి సినిమా పూర్తి కావాల్సి ఉన్నా పవన్ డేట్స్ కోసం కాస్త లేట్ అవుతూ వస్తుంది. ఓ పక్క తను స్థాపించిన జనసేన విధివిధానాలతో పాటుగా కమిట్ అయిన సినిమాలను కూడా చేస్తూ వస్తున్న పవన్ త్రివిక్రం సినిమాను బాగా లేట్ చేస్తున్నాడని టాక్.

ఇక ఈ గ్యాప్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువవుతుందట.. ఇప్పటికే బడ్జెట్ తన మార్కెట్ మించి పెట్టాడని రాధాకృష్ణ బెంగ పెట్టుకున్నాడట. త్రివిక్రం పవన్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉంటాయి. అయితే బడ్జెట్ సినిమా క్వాలిటీ మీద పెట్టినా ఓకే కాని సినిమా ప్రొడక్షన్ కు అనవసరంగా ఎక్కువ ఖర్చు అవుతుందని బాధపడుతున్నారట.

కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అంటున్న ఈ సినిమా నవంబర్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news