Gossipsఆ స్టార్ హీరో సినిమాకి ప్రొడ్యూసర్ గా పవన్

ఆ స్టార్ హీరో సినిమాకి ప్రొడ్యూసర్ గా పవన్

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తాడు. పవన్, నితిన్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకేనేమో ఆ దేవుడు నితిన్ కి వరం ఇచ్చినట్టు ఉన్నాడు. నితిన్ ని హీరోగా పెట్టి పవర్ స్టార్ ఓ సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో నితిన్ -మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్నారు. పవన్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి కలసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ‘గుర్తుందా శీతకాలం’ అనే టైటిల్‌ను పెట్టె ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

‘రౌడీ ఫెలో’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ అమెరికాలో రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు టైటిల్ ఎంపికపైనే ఇంకా ఒక క్లారిటీ రాలేదట. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ చిత్రంలో నితిన్‌ నటించారు. ఇందులో నితిన్‌కి జోడీగా సమంత నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది.

‘అ ఆ’కి అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించిన నటరాజ్ సుబ్రమణ్యన్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో పవన్ భక్తుడు తన దేవుడి నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news