బాలయ్య డైరెక్టర్ తో పవన్ సినిమా …2019 ఎన్నికల టార్గెట్

balakrishna

గమ్యం సినిమా నుండి బాలయ్య వందవ సినిమాగా వచ్చిన శాతకర్ణి వరకు సినిమా సినిమాకు తన దర్శకత్వ ప్రతిభ చాటుతున్న క్రిష్ ప్రస్తుతం కంగనా రనౌత్ తో మణికర్ణిక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుతం త్రివిక్రం సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉండగా ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరితో చేస్తాడు అన్న దాని మీద క్లారిటీ రాలేదు.

అసలైతే సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో మైత్రి మూవీస్ సినిమా ఉందని వార్తలు వస్తున్నా వాటిలో ఎంతవరకు నిజం అన్నది తెలియట్లేదు. అయితే క్రిష్ తో మాత్రం పవన్ సినిమా పక్కా అని తెలుస్తుంది. 2019 ఎన్నికల టార్గెట్ తో ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందట. తన సినిమాలో బలమైన కథ కథాంశం ఉండేలా జాగ్రత్తపడే క్రిష్ పవన్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే అంచనాలను తారాస్థాయిలో ఉంటాయి. మరి ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

.

 

Leave a comment