పవన్ కళ్యాణ్ ఆత్మహత్యాయత్నం..! షాక్ లో ఫ్యాన్స్..!

56

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి ఆత్మహత్యాప్రయత్నం చేయడం ఏంటి.. అసలు ఆయనకు ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచన రావడం ఏంటని అందరు ఆశ్చర్యపోవచ్చు. ప్రస్తుతం జనసేన అధినేతగా పోరాటయాత్ర అంటూ ప్రజల్లో మమేకమైపోతున్న పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటలను షేర్ చేసుకుంటున్నారు.

అందులో భాగంగా సుస్వాగతం సినిమా టైంలో తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేకుండానే నటిస్తుండటం సిగ్గుగా అనిపించిందని.. ఆ సినిమా టైంలో వేలమంది మధ్యలో బస్సు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని అందుకు తనకు చాలా సిగ్గుగా అనిపించిందని ఆ టైంలో తన వదిన సురేఖకు ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పి తనకు ఆత్యహత్య చేసుకోవాలని ఉందని చెప్పారట పవన్. ఆ టైంలో సురేఖా మొదట్లో అంతే ఉంటుందని తర్వాత అలవాటు అవుతుందని సపోర్టింగ్ గా మాట్లాడారట.

ఇక ఆ తర్వాత తర్వాత సినిమాల్లో నటిస్తూ పవన్ సిగ్గుపడటం ఆపేశాడట మొత్తానికి అలా పవన్ కళ్యాణ్ చనిపోదామనుకున్న ఆలోచనని సురేఖ పక్కకు పెట్టించగలిగారు.

Leave a comment