Gossipsషూటింగ్‌లో ప‌వ‌న్ కి గాయాలు...ప‌వ‌న్ పరిస్థితి ఇపుడు ఎలా వుంది?

షూటింగ్‌లో ప‌వ‌న్ కి గాయాలు…ప‌వ‌న్ పరిస్థితి ఇపుడు ఎలా వుంది?

శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న షూటింగ్‌లో ఓ చిన్న అంత‌రాయం.. యాక్ష‌న్ స‌న్నివేశంలో ప‌వ‌న్ గాయ‌ప‌డిన కార‌ణంగా.. ఈ వార్త గుప్పుమంది. కానీ ప‌వ‌న్ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోడుగా..! వెంట‌నే షూటింగ్ ని కంటిన్యూ చేయించాడు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి సంబంధించి చోటుచేసుకున్న ఘ‌ట‌న ఇది.ఈ చిత్రం కర్ణాటక ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.చిక్ మగళూర్ ప్రాంతంలో ఓ యాక్షణ్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

 

ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్‌కు గాయాల‌య్యాయి. ఇదివరకే పవన్‌కు ఓ గాయం కాగా, దాన్ని లెక్క చేయకుండా ఆ యన షూటింగ్లో పాల్గొంటున్నారు.ఇక తాజా ఘటనలోనూ ఆయన ఎడమచేతికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ గాయం కూడా చిన్నదేనని చిత్ర యూనిట్ వెల్లడించింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.కాగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుద‌ల చేయ‌నున్నారు. అనూ ఇమాన్యుయెల్‌, కీర్తి సురేశ్  నాయిక‌లు. దేవీశ్రీ స్వ‌ర‌క‌ర్త‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news