Gossipsపవర్ స్టారా మజాకా.. జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అభిమానులు..!

పవర్ స్టారా మజాకా.. జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అభిమానులు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. రాజకీయ పార్టీ పెట్టి సినిమాలకు దూరంగా ఉంటానన్నా సరే పవన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. చిన్నా పెద్ద తేడా లేదు పవర్ స్టార్ అన్న ఒక్క నినాదం వారికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆయన సినిమాలే కాదు రాజకీయంగా ఆయన వేసే అడుగులకు తాము తోడుంటాం అని బల్ల గుద్ది మరి చెబుతున్నారు.
1
ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రి నుండి 24 గంటలు గడవక ముందే 10 మిలియన్ ట్వీట్స్ రావడం చూస్తుంటే పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. పవర్ స్టార్ మేనియాలో ఎలాంటి రికార్డైనా తలవంచాల్సిందె.
2
ఈ రేంజ్ లో బర్త్ డే ట్వీట్స్ తో సంచలనం సృష్టించడం అది కేవలం పవన్ వల్లే అయ్యిందని చెప్పొచ్చు. సెలబ్రిటీస్, ఫ్యాన్స్ అనే తేడా లేకుండా అంతా కలిసి పవన్ పుట్టినరోజున విష్ చేయడం జరిగింది. మరోసారి ఈ ట్వీట్స్ వల్ల పవన్ కు జనాల్లో ఎ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్ధమవుతుంది.

ట్విట్టర్ మాత్రమే కాదు ఫేస్ బుక్ లో కూడా పవన్ కు విషెష్ చేస్తూ సందడి చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
3

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news