Gossipsమెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!

మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!

రీ ఎంట్రీ తర్వాత తన జోరు కొనసాగిస్తున్న మెగాస్టార్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో మెగాస్టార్ సినిమా ఉండబోతుందని లేటేస్ట్ టాక్. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటిస్తాడట. మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు ఒకే స్క్రీన్ పై ఆహా ఇక ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ మూవీ మొత్తం కనిపించినా పవన్ మాత్రం కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంటాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది. అప్పట్లో మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి సినిమా చేస్తారంటూ ఎనౌన్స్ చేసిన ఆయన మళ్లీ ఆ ఊసెత్తలేదు.

కాని ఫిల్మ్ నగర్ లో మాత్రం ఆ సినిమా కథల చర్చ నడుస్తుందని తెలుస్తుంది. చిరంజీవి, పవన్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయం. మరి మూవీ ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news