పవన్ వ్యక్తిత్వం అదేనా ..? అందుకే ఫ్యాన్స్ ఎగబడుతున్నారా..?

pavan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … ఈ పేరు చెప్తే చాలు అభిమానులు ఊగిపోతుంటారు. ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంటుంది. అది ఆయన సినిమాల్లో ఉన్నా .. రాజకీయాల్లో ఉన్నాఎక్కడ ఉన్నా అదే పరిస్థితి. పవన్ ఒక్కమాట చెప్తే చాలు అభిమానులు ఏమి చేయడానికైనా వెనుకాడరు. అంత అభిమానం పవన్ అంటే. కాదు కాదు అభిమానం కాదు పిచ్చి ఆయనంటే.

పవన్ ఎంత గొప్పోడా అని అడిగేవారికి దిమ్మతిరిగే సమాధానం దొరికేసింది. పవన్ ఎంత గొప్పోడా మరోసారి రుజువయ్యింది. అది ఎక్కడో కాదు ఈ రోజు జరిగిన అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ సందర్భంగా ఆ ఫంక్షన్ లో. అసలు ఏమైంది అంటే… పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకు రాగానేఒక అభిమాని ఆయన కాళ్ళపై పడిపోయాడు.

ఆయనకు ఏదో చెప్పబోతుండగావెంటనే అక్కడ ఉన్నబౌన్సర్లు స్టేజ్ మీదకు చేరుకునిఅతన్ని బలవంతంగా పక్కకు లాక్కుపోయారు. వెంటనే పవన్ వాళ్లను వారిస్తూవాళ్ల వెంటే స్టేజ్ చివరి వరకూ వెళ్లివాళ్ల వద్ద నుంచి అతన్ని విడిపించి దగ్గరగా తీసుకుని అతనితో ఓ సెల్ఫీ దిగి జాగ్రత్తలు చెప్పి మరీ పంపించాడు. అసలు పవన్ స్థాయి వ్యక్తి అలా ఓ అభిమాని కోసం అలా చెయ్యడం నిజంగా పవన్ లోని వ్యక్తిత్వం మరోసారి బయటపడేలా చేసింది.

Leave a comment