ఆందోళనలో పవన్ ఫ్యాన్స్.. రిలీజ్ డేట్ కి ముందే సినిమా రిలీజ్..

pavan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాప్ రిలీజ్ కు అంతా రెడీ అవుతుండగా ఇప్పుడు రిలీజ్ డేట్ లో ట్విస్ట్ ఫ్యాన్స్ ను కంగారు పడేలా చేస్తుంది. అదేంటి అనుకున్నట్టుగా అజ్ఞాతవాసి 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది కదా అంటే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ అజ్ఞాతవాసిని ఓ రోజు ముందే తీసుకొస్తున్నారు. జనవరి 10 అఫిషియల్ రిలీజ్ డేట్ అవగా ఓ రోజు ముందే 9నాడే సెకండ్ షోస్ తో సినిమా రిలీజ్ అవుతుందట.

అయితే ఇది అన్ని ఏరియాల్లోనా లేక సెలెక్టెడ్ ఏరియాలా అన్నది తెలియాల్సి ఉంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇండియన్ సినిమాల్లోనే హయ్యెస్ట్ లొకేషన్స్ లో రిలీజ్ అవుతూ సంచలనం సృష్టిస్తుండగా సినిమా ప్రీమియర్స్ తోనే రికార్డ్ కలెక్షన్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఓ పక్క కత్తి మహేష్ సినిమా రిలీజ్ టైం లోనే పవన్ ను టార్గెట్ చేయడం పట్ల ఫ్యాన్స్ కాస్త ఆందోళనలో ఉండగా సినిమా రిలీజ్ హంగామా ఈరోజు నుండి షురూ చేస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా లార్గో వించ్ సినిమాకు అఫిషియల్ కాపీ అంటూ వార్తలు రాగా ఈ ప్రశ్నలన్నిటికి మరో రెండు రోజుల్లో సమాధానం దొరకబోతుందని చెప్పొచ్చు.

Leave a comment