అల్లుఅరవింద్,చిరు పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పవన్

pavan kalyan

ప్ర‌జారాజ్యం పార్టీలాగా, ఆ పార్టీలో చేరిన‌ కొంద‌రు స్వార్ధపరుల్లాగా నేను బ‌ల‌హీన‌మైన వ్య‌క్తిని కాదు. చిరంజీవి అంత మంచిత‌నం నాలో లేదు. ద‌య‌చేసి మీరంద‌రూ గుర్తు పెట్టుకోండి. చిరంజీవిగారికి చాలా స‌హ‌నం ఉంది పడ‌తారు. కానీ నేను అలా కాదు. ప్ర‌జ‌ల‌కి మోసం జ‌రుగుతున్న‌ప్పుడు ప‌డే వ్య‌క్తిత్వం నాది కాదు. వ్య‌క్తిగ‌తంగా న‌న్ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తే ఊరుకుంటాను. ప్ర‌జ‌ల కోసం ముందుకు వ‌చ్చిన‌ప్పుడు న‌న్ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తే అస్సలు ఊరుకోను అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించాడు.

రాజమండ్రిలో జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కాపు రిజ‌ర్వేష‌న్లు చేస్తే బీసీలు గొడ‌వ‌ప‌డ‌తారు విధ్వంసం జ‌రుగుతుంద‌ని కొంద‌రు అంటున్నారు. కాపులకి బీసీలు వ్య‌తిరేక‌మ‌ని ఎందుకు అనుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో చేర్చినపుడు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు ఆ విషయం గుర్తుకు రాలేదా ..? అంటూ పవన్ఏ ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను ఆకతాయితనంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని, దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధం సిద్దముగా ఉన్నానంటూ పవన్ ప్రసంగించారు.

చిరంజీవికి కాపు ముద్ర వేశారు… మరి పాలకొల్లులో ఎందుకు ఓడారని ప్రశ్నించారు. అన్ని కులాల నుంచి నన్ను అభిమానించేవాళ్లున్నారు, అన్ని కులాలను గౌరవిస్తాను ఏ కులాన్నినేను వ్యక్తిగతంగా వెనకేసుకురాను అన్నారు. రాజధాని రైతులను కలిసేందుకు వచ్చినప్పుడు తప్పుడు కథనాలు రాశారు… నా చుట్టూ కాపు నాయకులే ఉన్నారనడం కట్టుకధలని పవన్ చెప్పుకొచ్చారు. జ‌న‌సేన‌లోకి వ‌స్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతారనుకుంటే … ఎవ్వరూ రావొద్దు ప్ర‌జా సేవ చెయ్యాలనుకుంటేనే పార్టీలోకి రండి. పార్టీలో నాకు కొంద‌రు ఎక్కువ‌, త‌క్కువ అని ఉండదు అందరిని సమానంగానే చూస్తానని పవన్ చెప్పుకొచ్చాడు.

Leave a comment