ఆ హీరో ముద్దుకోసం ఎదురుచూస్తున్నా..?

46

బాలీవుడ్ హాట్ భామ పరిణీతి చోప్రా అంటే బీ టౌన్ లో సూపర్ క్రేజ్.. తన ప్రతి సినిమాలో లిప్ లాక్స్ తో తన ఫ్యాన్స్ ను ఏమాత్రం డిజప్పాయింట్ చేయని పరిణీతి చోప్రా ఈమధ్య కెరియర్ లో కాస్త వెనుకపడ్డది అన్నది వాస్తవం. ప్రస్తుతం అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రలతో జోడీ కడుతున్న ఈ అమ్మడు సైనా నెహ్వాల్ బయోపిక్ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఇక రీసెంట్ గా నేహా ధూపియా టాక్ లో పాల్గొన్న పరిణీతి తనకు అర్జున్ కపూర్ తో లిప్ లాక్స్ చాలా ఇష్టమని చెప్పింది.

అర్జున్, సిద్ధార్థ్ ఈ ఇద్దరిలో ఎవరితో నువ్వు ముద్దులు ఇష్టపడతావు అంటే అర్జున్ కపూర్ తోనే అని చెప్పింది పరిణీతి చోప్రా. ఇష్క్ జాదే సినిమాలో ఈ ఇద్దరి పెయిర్ సూపర్ హిట్ అనిపించుకుంది. ఇద్దరి రొమాన్స్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అర్జున్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అందుకే అతనితో లిప్ లాక్స్ అంటే చాలా ఇష్టమని చెబుతుంది పరిణీతి. అంతేకాదు అతనితో నటించడానికి చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతా అంటుంది అమ్మడు.

మరి ఇంతమంది భామలు అర్జున్ ను ఇష్టపడుతున్నా అతను మాత్రం ముదురు భామ మలైకా అరోరాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతాడు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఛాన్స్ వచ్చినా అమ్మడు చేయలేదని వార్తలు వచ్చాయి. అయితే వాటిల్లో ఏమాత్రం నిజం లేదన్నట్టు చెప్పుకొచ్చింది పరిణీతి చోప్రా.

Leave a comment