పరి టీజర్.. అనుష్కను చూస్తే.. ప్యాంటు తడిసిపోతుంది..!

pari-teaser

కరెక్ట్ గా తీస్తే చాలు కాని హారర్ సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఓ వర్గం ప్రేక్షకులు కేవలం వాటినే ఇష్టపడతారంటే నమ్మాల్సిందే. రొటీన్ కామెడీ, సెంటిమెంట్, మాస్, యాక్షన్ ఇలాంటివన్ని చూసిన ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురుచూస్తారు. ఇక హారర్ అంటే భయపెట్టడమే.. కాని ఆ భయాన్ని కలిగించేలా చేయడమే గొప్ప విషయం. ఈమధ్య బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా ఇదే తరహాలో సినిమాలు మంచి సక్సెస్ రేటు సాధిస్తున్నాయి.

ఈ క్రమంలో బాలీవుడ్ క్రేజీ భామ అనుష్క శర్మ ఓ హారర్ మూవీలో నటించింది. అదే పరి. ప్రోసిత్ రాయ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క శర్మతో పాటుగా ప్రరంబత చటర్జీ, రజత్ కపూర్, రీతాబరి చక్రవర్తి లీడింగ్ యాక్టర్స్ గా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది నిమిషం టీజర్ లోనే ప్యాంటు తడిసేలా చేసిన దర్శకుడు సినిమా తప్పకుండా ఇదే రేంజ్ లో తీశాడని అనిపిస్తుంది.

టీజర్ లో అనుష్క దెయ్యంగా కనిపిస్తుంది. కెరియర్ లో ఇలాంటి పాత్ర మొదటిసారి చేస్తున్న అమ్మడు చూస్తుంటే అటెంప్ట్ గట్టిగానే చేసినట్టు ఉంది. టీజర్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉండగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మార్చి 2న హోలీ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది.

Leave a comment