‘పంతం’ పబ్లిక్ టాక్

33

గోపీచంద్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన చిత్రం ‘పంతం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కె చక్రవర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ‘ఆక్సిజన్‌’ చిత్రం నిరాశపరచటం తో గోపీచంద్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. ‘పంతం’ సినేమాతోనైనా గోపీచంద్ సినీ కెరీర్ మళ్లీ ట్రాక్ లో కి వస్తుందో లేదో కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

ఈ సినిమా కథ ప్రముఖ ఆంగ్ల చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ ని పోలి ఉందని మొదటి ఆట చుసిన పలువురు ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. దొంగతనాలు చేసే విధానం, పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని టాక్. గోపీచంద్‌ చెప్పిన కొన్ని డైలాగ్స్ మూవీ కి హైలైట్ కానున్నాయి అని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా కోర్టు లో గోపీచంద్ పలికే సంభాషణలు సామాన్య ప్రజలని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించగా, కేకే రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా పై ప్రజల స్పందన ఈ వీడియో లో మీరే చుడండి.

Leave a comment