పంతం 2 డేస్ కలెక్షన్స్..!.. గోపిచంద్ సత్తా చాటాడు..!

12

మాస్ హీరోగా సూపర్ క్రేజ్ అందుకున్న గోపిచంద్ చక్రవర్తి డైరక్షన్ లో చేసిన సినిమా పంతం. మంచి మెసేజ్ తో కూడిన కథతో వచ్చిన ఈ సినిమా గురువారం రిలీజ్ అయ్యి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. కొందరు సినిమాలో మెసేజ్ ను చూసి బాగుందని చెబుతుంటే.. కొందరు మాత్రం క్లైమాక్స్ లో ఆ కోర్ట్ సీన్ కోసం సినిమా మొత్తం భరించాలా అనంటున్నారు.

ఏది ఏమైనా పంతం గోపిచంద్ కు మంచి జోష్ ఇచ్చిందని చెప్పాలి. ఇక మొదటిరోజు 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 2.80 కోట్ల షేర్ వసూళు చేసింది. గోపిచంద్ నటించిన గౌతం నంద మొదటి రోజు 3.26 కోట్లు రాబట్టింది. పంతం దానితో పోల్చుకుంటే కాస్త తగ్గినా బి,సి సెంటర్స్ లో ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు.

ఇక రెండో రోజు పంతం మంచి వసూళ్లనే రాబట్టింది. అటు ఇటుగా 1 కోటి పైగా కలక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక వెనుకపడిన గోపిచంద్ పంతంతో పర్వాలేదు అనిపించుకున్నాడు.

Leave a comment