Moviesరథం పడి పో సాంగ్.. RX 100 ను మించిపోయింది..!

రథం పడి పో సాంగ్.. RX 100 ను మించిపోయింది..!

సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉంటే చాలు అవి ఖచ్చితంగా ఆడేస్తాయని అంటున్నారు. అయితే ఇక్కడ దర్శక నిర్మాతలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే బోల్డ్ కంటెంట్ తో పాటుగా కథలో కూడా దమ్ముండాలి. లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి, ఈ ఇయర్ ఆరెక్స్ 100 ఈ సినిమాల్లో అడల్ట్ డోస్ ఎక్కువే కాని ఆ సినిమాల కథలు కొత్తవే. అందుకే సినిమాలు సక్సెస్ అయ్యాయి.

అయితే ఇప్పుడు అదే పంథాలో వస్తున్న సినిమా రథం. ఈమధ్యనే రిలీజ్ అయిన సినిమాలో పడిపో సాంగ్ వెరైటీ కిస్సుతో సర్ ప్రైజ్ చేసింది. తలకిందులుగా ఉన్న హీరోయిన్ తో హీరో ముద్దులాట భలే అనిపించింది. ఇదంతా సినిమా ప్రమోషన్స్ కు.. యూత్ ను ఎట్రాక్ట్ చేసేందుకే అని తెలుస్తున్నా.. సినిమాకు ఈ సాంగ్ మంచి మైలేజ్ తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు.

గీతానంద్, చాందిని బాగ్వాని జోడిగా వస్తున్న ఈ రథం సినిమాను చంద్రశేఖర్ కానూరి డైరెక్ట్ చేస్తుండగా దారపునేని రాజా నిర్మిస్తున్నారు. సుకుమార్ పమ్మి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ మెలోడీగా ఉన్నాయి. పడిపో సాంగ్ విజువల్ గా కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. మరి ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news