” పడి పడి లేచె మనసు ” ఆఫీషియల్ టీజర్.. నిజంగానే పడేసేలా ఉన్నారు..!

128

శర్వానంద్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. శర్వానంద్ క్రేజీ లుక్స్ లో కనిపించగా.. సాయి పల్లవి సింపుల్ గా కనిపించి అలరించింది.

లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో శర్వా, సాయి పల్లవిల జోడి బాగుందని చెప్పొచ్చు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా నిమిషం టీజర్ లోనే మంచి ఫీల్ వచ్చేలా చేసింది. లై సినిమా తర్వాత హను రాఘవపుడి చేస్తున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. యూత్ ఆడియెన్స్ టార్గెట్ తో వస్తున్న పడి పడి లేచే మనసు టీజర్ మాత్రం నిజంగానే ప్రేమలో పడేసేలా చేసిందని చెప్పొచ్చు.

ఫిదా, ఎం.సి.ఏ సినిమాల తర్వాత సాయి పల్లవి నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగున్నాయి. శర్వానంద్ కూడా మహానుభావుడు తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు.

Leave a comment