” పందెం కోడి-2 ” రివ్యూ & రేటింగ్

152

2005 లో వచ్చిన విశాల్ పందెం కోడి సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో విశాల్ కు ఆ సినిమా మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. లింగుస్వామి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాకు సీక్వల్ గా పందెం కోడి-2 సినిమా వచ్చింది. విశాల్ సరసన కీర్తి సురేష్ నటించగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

పందెం కోడి ఎక్కడ ముగిసిందో అక్కడే మొదలవుతుంది ఈ సినిమా.. రాయలసీమలో ఒక ఊరిలో పెద్ద కుటుంబాన్ని ఢీ కొట్టేందుకు వేరొక ఊరి నుండి వచ్చి ఆ సీమ వారసుడి చేతిలో చావు దెబ్బ తింటాడు విలన్.. ఇది పందెం కోడి సినిమా కథ. అయితే దానికి కొనసాగింపుగా ఆ విలన్ కు సంబందించిన ఓ ఆడ మనిషి హీరో మీద పగబట్టేస్తుంది. రక్తపాతానికి దూరంగా ఉంటానని చెప్పిన తండ్రి మాటకు కట్టుబడిన హీరో రౌడీల అన్యాయాలను చూడలేక ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే పందెం కోడి-2 కథ.

నటీనటుల ప్రతిభ :

విశాల్ ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈమధ్య తెలుగు, తమిళంలో వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న విశాల్ పందెం కోడి సీక్వల్ తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పొచ్చు. కీర్తి సురేష్ తన సహజ నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో పులివెందుల బిడ్డగా తన చిలిపిగా ఉంటూ పౌరుషాన్ని చూపించింది. ఇక సినిమాలో మరో హైలెట్ పాత్ర వరలక్షమి చేసింది. ఆమె నటనకు అందరు షాక్ అవుతారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

శక్తివేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. సీమ అందాలను బాగా తెరకెక్కించాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. సాంగ్స్ తో పాటుగా బిజిఎం అలరించింది. లింగుస్వామి కథ, కథనాలు రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాగానే అనిపించినా రేసీ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. జికే ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

పందెం కోడి సీక్వల్ గా వచ్చిన పందెం కోడి 2 దాదాపు అలాంటి కథతోనే వచ్చిందని చెప్పొచ్చు. రాయలసీమ పౌరుషాన్ని చూపించేలా దర్శకుడు లింగుస్వామి కథ రాసుకున్నారు. అయితే ఇదవరకే ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కథ రొటీన్ గా ఉన్నా కథనంలో దర్శకుడు మెప్పించాడు.

ఆడియెన్స్ ఇంప్రెస్ అయ్యేలా రోమాలు నిక్కబొడుకునే రెండు మూడు సీన్స్ అలరిస్తాయి. సూపర్ సినిమా సీక్వల్ కు సూపర్ హిట్ అందుకున్నట్టే. యూత్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. సినిమా కాస్టింగ్, ఫైట్స్, సాంగ్స్ అన్ని బాగా కుదిరాయి.

ప్లస్ పాయింట్స్ :

విశాల్, కీర్తి సురేష్

వరలక్ష్మి శరత్ కుమార్ నటన

యువ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

తెలిసిన కథ

కథనం

తమిళ ఫ్లేవర్ ఎక్కువవడం

బాటం లైన్ : పందెం కోడి-2 సీమ పౌరుషం చూపించే సినిమా..!

రేటింగ్ : 3.0/5

Leave a comment