మాయాబజార్ లో శశిరేఖ.. మహానటిలో కనిపిస్తే..! (వీడియో)

mahanati-mayabazar

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తుంది. అశేష ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకుంటున్న మహానటి సినిమా ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషస్ కూడా అదరగొడుతున్నారు మేకర్స్. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమా వైజయంతి బ్యానర్లో అశ్వనిదత్ నిర్మాణంలో స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు.

ఈ సినిమాలో మాయాబజార్ లోని కొన్ని సీన్స్ ఉన్నాయి. సినిమా నుండి లేటెస్ట్ ప్రోమోలో ప్రియదర్శి గురించి సావిత్రి మాయాబజార్ చిత్రయూనిట్ తో మాట్లాడే సీన్ రివీల్ చేశారు. ఈ సన్నివేశం సినిమాలో లేదు కాని సినిమా ప్రమోషన్ కు ఇది ఉపయోగపడుతుంది. మాయాబజార్ లో శశిరేఖ మహానటిలో కనిపించి అలరించింది.

సినిమాలో సావిత్రమ్మగా నటించిన కీర్తి సురేష్ అందరి నుండి గొప్ప ప్రశంసలు అందుకుంటుంది. మహానటిగా ఆమె నటించిన తీరు అద్భుతమని అందరు కొనియాడుతున్నారు.

Leave a comment