ప్రభాస్ వచ్చేశాడహో.. ఇన్ స్టాలో బాహుబలి పిక్..అప్పుడే 7 మిలియన్ ఫాలోవర్స్..!

160

ప్రతి ఒక్క హీరో తమ అభిమానులకు టచ్ లో ఉండేందుకు సోషల్ ఫ్లాట్ ఫాం బాగా వాడేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఇలా అన్నిటిలో ఖాతాలు తెరిచి వారి సినిమాల అప్డేట్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే అందరిది ఒకదారి అయితే తనది మరోదారి అన్నట్టు ఇన్నాళ్లు వీటికి దూరంగా ఉంటూ వచ్చాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే.

అలాంటి మన యంగ్ రెబల్ స్టార్ కు ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలలో ఎకౌంట్స్ లేవు. ఫైనల్ గా అందరు చెప్పగా చెప్పగా ప్రభాస్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ తెరిచాడు. తన ఇన్ స్ట్రాలో బాహుబలి పిక్ ఒకటి పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ప్రభాస్ ఇన్ స్ట్రాగ్రాం లోకి వచ్చాడో లేదో అప్పుడే 7 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది.

ప్రభాస్ ఇన్ స్ట్రాగ్రాం లోకి రావడం పట్ల తన కో యాక్టర్స్ అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు. తమన్నా లాంటి భామ అయితే తాము ఎన్నాళ్ల నుండో ప్రభాస్ కు చెబుతున్నా చేయలేదని ఫైనల్ గా అతనికి గ్రాండ్ వెల్ కం అన్నది. సో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది సర్ ప్రైజ్ న్యూస్ అని చెప్పొచ్చు

Leave a comment