ఆపరేషన్ 2019 ట్రైలర్.. శ్రీకాంత్ అదరగొట్టాడు..!

21

ఆపరేషన్ దుర్యోధన తర్వాత ఆపరేషన్ 2019 సినిమా వస్తుంది. శ్రీకాంత్ పవర్ ఫుల్ పొలిటిషియల్ రోల్ లో నటిస్తున్న ఈ ఆపరేషన్ 2019 ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో శ్రీకాంత్ లుక్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. టీజర్ తో సంచలనం రేపిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు హంగామా చేస్తుంది.

ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను అలివేలు నిర్మిస్తున్నారు. కరణం బాబ్జి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీకంత్ సరసన దీక్ష పంత్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో సునీల్, మంచు మనోజ్ కూడా ఉంటారని తెలుస్తుంది. ట్రైలర్ లో మాత్రం వారిని రివీల్ చేయలేదు.

శ్రీకాంత్ ఆపరేషన్ దుర్యోధన అప్పట్లో సెన్సేషన్ సృష్టించగా.. ఇప్పుడు రాబోతున్న ఆపరేషన్ 2019 సినిమా కూడా ప్రస్తుతం ఉన్న తెలుగు రెండు రాష్ట్రాల పొలిటికల్ ఫీవర్ ను మరింత పెంచేలా అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Leave a comment