‘ఒక్క క్ష‌ణం’ … ఫస్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. డిజాస్ట‌ర్లకే చుక్కలు చూపించిన డిజాస్ట‌ర్

oka kshanam

అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఒక్క క్షణం. చక్రి చిగురుపాటి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటించగా మణిశర్మ మ్యూజిక్ అందించాడు. డిసెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచినా సినిమా మాత్రం సక్సెస్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని తెర మీద చూపించడంలో విఫలమయ్యాడు.

ఇక టాక్ బాగున్నా సినిమా కలక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. తొలి వీకెండ్ లో కేవలం 2.95 కోట్ల వసూళ్లను మాత్రం వసూళు చేసింది ఒక్క క్షణం. శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్ తో అల్లు శిరీష్.. ఎక్కడికి పోతావు సినిమా సూపర్ హిట్ అవడంతో డైరక్టర్ విఐ ఆనంద్ మీద ఉన్న నమ్మకంతో ఒక్క క్షణం సినిమా 11.50 కోట్ల దాకా బిజినెస్ జరిగింది.

ఇక ఇప్పుడు ఆ సినిమా వసూళ్లను చూసి డిస్ట్రిబ్యూటర్లు షాక్ అవుతున్నారు. సినిమా టాక్ పర్వాలేదు అన్నట్టు వచ్చినా వసూళ్లు మాత్రం దారుణంగా ఉండటం షాక్ ఇస్తుంది. శ్రీరస్తు శుభమస్తు సినిమా మొదటి వారాంతరంలో 9 కోట్ల పైగా వసూళు చేయగా ఒక్క క్షణం 3 కోట్లు కూడా దాటకపోవడం ఆశ్చర్యకరం.

Leave a comment