Movies"ఒక్క క్షణం" సెన్సార్ రిపోర్ట్

“ఒక్క క్షణం” సెన్సార్ రిపోర్ట్

అల్లు శిరీష్‌, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్‌ వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. అవసరాల శ్రీనివాస, సీరత్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్ర సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్‌ లభించింది. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్ర కథ ఇద్దరి జీవితాలకు సంబంధించింది. ఒకరు ప్రస్తుతం, మరొకర భవిష్యత్తు అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. సెన్సార్‌ సభ్యులు ప్రశంసలు దక్కాయి. ఈ నెల 28న సినిమాను విడుదల చేస్తున్నాం. అబ్బూరి రవి, చోటా కె ప్రసాద్‌, శ్యామ్‌ కె.నాయుడు వంటి సీనియర్‌ సాంకేతిక నిపుణులు మా సినిమాకు పనిచేయడం విశేషమన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news