‘ ఓ బేబీ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… స‌మంత టార్గెట్ ఇదే..

టాలీవుడ్‌లో ఇటీవ‌ల మంచి కంటెంట్‌తో వ‌చ్చే సినిమాల‌కు రిలీజ్‌కు ముందు మంచి రేట్లు ప‌లుకుతున్నాయ్‌. తాజాగా స‌మంత న‌టిస్తోన్న ఓ బేబీ సినిమాకు కూడా ఇప్పుడు మంచి ల‌క్ చిక్కింది. మూడు నిర్మాణ సంస్థ‌లు క‌లిసి నిర్మించిన ఈ సినిమాకు మొత్తం రూ.13 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఆంధ్రా, నైజాం హ‌క్కుల‌తో సంబంధం లేకుండానే అప్పుడే నిర్మాత‌ల‌కు కాస్త అటూ ఇటూగా రూ.13 కోట్లు రిక‌వ‌రీ అయిపోయాయ్‌.

ఈ 13 కోట్ల లెక్క చూస్తే ఓవ‌ర్సీస్ రైట్స్ ద్వారా రూ. 1.75 కోట్లు – కర్ణాటక హక్కులు 75 లక్షలు – నెట్ ఫ్లిక్స్ ద్వారా రూ. 3 కోట్లు – శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు… హిందీ డబ్బింగ్‌కు కూడా మూడుకోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే రూ. 11 కోట్ల వరకు రికవరీ అయిపోయింది. సినిమాకు ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్‌ను బ‌ట్టి మంచి క్రేజే ఉంది. ఇక స‌మంత సినిమాలు వ‌రుస‌గా హిట్ అవుతుండ‌డంతో మార్కెట్ కూడా బాగానే ఉంది.

సినిమాకు హిట్ క‌ళ క‌నిపిస్తుండ‌డంతో టాక్ బాగుంటే వ‌సూళ్ల దుమ్ము రేప‌డం ఖాయం. పైగా ఇప్ప‌ట్లో పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం కూడా క‌లిసిరానుంది. సినిమాలో సురేష్‌బాబు భాగ‌స్వామి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌నే ఓన్ రిలీజ్ చేస్తున్నారు. మ‌రి ఓ బేబీగా స‌మంత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలా స‌త్తా చాటుతుందో ? చూడ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది.

Leave a comment