‘ఓ బేబీ’ ఫస్ట్ డే కలక్షన్స్..

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి అఫిషియల్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. సినిమాలో లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నాగ శౌర్య, తేజ వంటి స్టార్స్ నటించారు. శుక్రవారం రిలీజైన ఓ బేబీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక మొదటి రోజు బేబీ వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు ఓ బేబీ 1.35 కోట్ల షేర్ రాబట్టింది. సమంత సోలోగా చేసిన సినిమా కాబట్టి ఆమె వరకు ఇది హయ్యెస్ట్ కలక్షన్స్ అని చెప్పొచ్చు. సమంత యూటర్న్ సినిమా మొదటి రోజు 1.09 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక ఏరియాల వారిగా ఓ బేబీ మొదటిరోజు కలక్షన్స్ వివరాలు :

నైజాం : 0.59 కోట్లు

సీడెడ్ : 0.17 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.20 కోట్లు

గుంటూరు : 0.09 కోట్లు

ఈస్ట్ : 0.08 కోట్లు

వెస్ట్ : 0.07 కోట్లు

కృష్ణా : 0.12 కోట్లు

నెల్లూరు : 0.04 కోట్లు

ఏపి/తెలంగాణా : 1.36 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 0.45

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 1.0 కోటి
————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే = 2.81 కోట్లు
————————————–

Leave a comment