ఎన్టీఆర్ సృష్టించిన అరుదైన రికార్డ్ ఇది…ప్రపంచంలో 6వ స్థానం

ntr

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టెంపర్ సినిమా ముందుదాకా కెరియర్ కాస్త అయోమయంలో నడిచిందని అనిపించగా ఫైనల్ గా టెంపర్ తో ఎన్.టి.ఆర్ హంగామా షురూ చేశాడు. ఆ సినిమా హిట్ తో వరుస విజయాలను అందుకుంటున్నాడు. టెంపర్ నుండి రీసెంట్ హిట్ జై లవ కుశ వరకు ఎన్.టి.ఆర్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు.

కేవలం సినిమాలతోనే కాదు ఓ సూపర్ స్టార్ అయ్యుండి బుల్లితెర మీద కూడా తన విశ్వరూపం చూపించాడు ఎన్.టి.ఆర్. స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు ప్రపంచవ్యాప్తంగా 2017 లో ఎక్కువగా సెర్చ్ చేసిన లిస్ట్ లో 6వ స్థానం దక్కించుకుందట. ఎన్.టి.ఆర్ వల్లే బిగ్ బాస్ రియాలిటీ షో నిలబడిందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ తెలుగు కంటెస్టంట్స్ అంత పాపులర్ కాకున్నా సరే తారక్ తన అదరగొట్టే వ్యాఖ్యానంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. మొత్తంగా మరోసారి ఎన్.టి.ఆర్ స్టామినా స్థాయి ఏంటో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ ర్యాంకులను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Leave a comment