కోత మొదలుపెట్టిన ఎన్టీఆర్.. కెరీర్‌లోనే టాప్!

25

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అత్యంత భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తుండటంతో ఈ మూవీపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో తారక్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు జనాలు.

కాగా ఈ సినిమాతో తారక్ రికార్డుల కోత మొదలు పెట్టాడు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు వారు అత్యంత భారీ రేటుకి అమ్ముడు కావడంతో యావత్ తెలుగు ఇండస్ట్రీ షాక్‌కు గురయ్యారు. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు ఛానల్ వారు ఏకంగా రూ. 23.5 కోట్ల భారీ రేటుకు కోనుగోలు చేయడంతో తారక్ కెరీర్‌లోనే ఇది అత్యంత క్రేజీ డీల్‌గా నమోదు అయ్యింది. ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కాని ఈ సినిమాకు అప్పుడే ఇలాంటి భారీ శాటిలైట్ రైట్స్ రావడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనాలు.

తారక్ అదిరిపోయే రోల్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా మెగా బ్రదర్ నాగబాబు అదిరిపోయే రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

Leave a comment