ఎన్టీఆర్ – చెర్రి  ఓ మల్టీస్టార్…  జక్కన్న  ప్లాన్ ఇదే !

rajmouli

భారీ సినిమాల బాహుబలి జక్కన్న మరో సంచలనం తెరకెక్కించేందుకు సిద్దమైపోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే   మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ -రామచరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో. ఈ వార్త ఇప్పుడిప్పుడే బయటకి పొక్కుతుండడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఈ వార్త  బయటకి రావడానికి కారణం  కూడా రాజమౌళినే.  ఏమీ చెప్పకుండానే ఒక్క ఫొటో పోస్టింగ్ తోనే రాజమౌళి విషయం బయటకి తెలిసేట్లు జక్కన్న తన తెలివితేటలు ఉపయోగించాడు.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ లతో కలిసి కూర్చున్న సరదా ఫొటోను రాజమౌళి ట్వీట్ చేసాడు. ఏ విధమైన వాఖ్యానం లేదు. జస్ట్ ఓ స్మయిలీ సింబల్ తప్ప. దీని అర్థం వారి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాననే అనుకోవాల్సి వస్తోంది.

పైగా చరణ్, ఎన్టీఆర్ లకు సన్నిహితంగా ఉన్నవారిని అడిగితే, ఇప్పుడే తామేం చెప్పలేమని అంటున్నారు. కానీ అదే సమయంలో ఈ కాంబినేషన్ ను కొట్టి పారేయలేమనీ అంటున్నారు. ఇదే కాంబినేషన్ వుండొచ్చని గత కొన్నాళ్లుగా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.

చరణ్-ఎన్టీఆర్ లకు తోడు పక్క భాషలకు చెందిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఓ విలన్ తోడయితే ఇక మళ్లీ ఓ రేంజ్ సినిమా తయారవుతుంది. ఈ సినిమాకు నిర్మాత డివివి దానయ్యే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

రామ్ చరణ్ చేస్తున్న రంగస్థలం పూర్తి కావస్తోంది. ఆ తరువాత బోయపాటి సినిమా చేయాలి.

అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయాలి. అంటే చరణ్, ఎన్టీఆర్ చెరో సినిమా చేయగానే రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం వుంటుంది. జక్కన్న విషయానికి వస్తే ఎన్టీఆర్ తో మూడు సినిమాలు , చరణ్ తో తిరుగులేని హిట్ మగధీర సినిమాని చేసాడు.

 

Leave a comment