ఇది తెలుగువాడి విజయం.. తెలుగుజాతి గర్వించదగ్గ చిత్రం : శాతకర్ణిపై ఎన్టీఆర్ ట్వీట్స్

ntr tweets on gautamiputra satakarni

Young tiger NTR praises his Babai, director Krish and the whole team of Gautamiputra Satakarni after watching the film. Read below articles to know what he told.

బాబాయి – అబ్బాయిలైన బాలయ్య – ఎన్టీఆర్‌లు ఇన్నాళ్లు ఎందుకు దూరంగా ఉన్నారో, వారిమధ్య ఎలాంటి విభేదాలున్నాయో అనే విషయాల్ని కాస్త పక్కనపెట్టేస్తే.. ఈమధ్య తారక్ ట్విట్టర్ వేదికగా తన బాబాయిపై, ఆయన ప్రతిష్టాత్మక వందోచిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నాడు. మొదట్లో టీజర్ రిలీజైనప్పుడు పాజిటివ్‌గా స్పందించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది. ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ నేరుగా ట్విటర్‌లో స్పందించాడు. ట్రైలర్ అదిరిపోయిందని, బాబాయ్ ఎప్పటిలాగే తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడని, ఆయన్ను అలాంటి గెటప్‌లో చూపించినందుకు డైరెక్టర్ క్రిష్‌కి ధన్యవాదాలని పేర్కొన్నాడు.

ఈ విధంగా ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించడాన్ని చూసి.. అతడు ఖచ్చితంగా సినిమా కూడా చూస్తాడని అందరూ ఓ అంచనాకి వచ్చేశారు. అనుకున్నట్లుగానే తారక్ సినిమా చూసేశాడు. దర్శకుడు క్రిష్‌తో కలిసి ఆదివారం సాయంత్రం చూశాడు. ట్రైలర్‌ మీద పొగడ్తల వర్షం కురిపించిన తారక్.. ఇక సినిమా చూశాక ఊరికే ఉంటాడా? ఆకాశానికెత్తేశాడు. తన బాబాయి, క్రిష్, చిత్రబృందాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ‘ఇప్పుడే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాని చూశా. ఈ సినిమాపై నేను చెప్పదలచుకున్నదే ఒక్కటే. సాహో బాలయ్య, సాహో క్రిష్, సాహో శాతకర్ణి చిత్రబృందం. ఇది ఒక తెలుగు వాడి విజయం. తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం. చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం’ అని ట్వీట్స్ చేశాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో సంతోషంలో మునిగితేలుతున్న అభిమానులు.. ఎన్టీఆర్ చేసిన ట్వీట్స్‌తో పూనకంతో ఊగిపోతున్నారు. మొత్తానికి.. ఇన్నాళ్లు దూరంగా వున్న బాబాయి-అబ్బాయిలను ‘శాతకర్ణి’ దగ్గరికి తీసుకొచ్చాడు.

Leave a comment