ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల అరవింద సమేత వీర రాఘవ (ఫస్ట్ లుక్ ఫోటోలు)

aravinda-sametha-veera-ragh

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అరవింద సమేత వీర రాఘవ. కొద్ది నిమిషాల క్రితమే ఈ సినిమా టైటిల్ తో పాటుగా యంగ్ టైగర్ స్టైలిష్ లుక్ ను రివీల్ చేశారు చిత్రయూనిట్. ఎన్.టి.ఆర్ త్రివిక్రం మొదటిసారి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్ లుక్ అదరగొట్టాడు. ఈ ఫస్ట్ లుక్ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పొచ్చు.

ఫస్ట్ లుక్ తోనే ఎన్.టి.ఆర్ తన ఇంటెన్సిటీ ఏంటో చూపించాడు. ఇక టైటిల్ ను బట్టి చూస్తే అజ్ఞాతవాసితో తప్పిన త్రివిక్రం లెక్క ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కేస్తాడని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తుండగా పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

asvr

DdjpRL3V4AAjaVP

Leave a comment