Gossipsపూజ వల్ల ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోతుందా..?

పూజ వల్ల ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోతుందా..?

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేత దసరా బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తుండగా సినిమా పూజా వల్లే లేట్ అవుతుందని అంటున్నారు.

ముకుందతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె ఒక లైలా కోసం, డిజే మూవీల్లో నటించింది. డిజే పర్వాలేదు అనిపించినా అమ్మడిది ఇంకా ఐరన్ లెగ్ అన్న టాక్ వినిపిస్తుంది. ఎన్.టి.ఆర్ సినిమా గురించి ఏమాత్రం ప్రమోషన్ చేయని పూజా హెగ్దె చేయబోతున్న హౌజ్ ఫుల్-4 గురించి మాత్రం ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు షూటింగ్ టైంలో కూడా అరవింద సమేతకు సపోర్ట్ చేయట్లేదని అంటున్నారు. తెలుగులో ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో సినిమాపై పూజా చూపిస్తున్న అశ్రద్ధ తన తదుపరి సినిమాల మీద కచ్చితంగా పడుతుంది. అమ్మడు ఆ విషయం గమనిస్తే బెటర్ లేదంటే ఇక్కడ ఆఫర్లు మిస్ చేసుకునే ఛాన్స్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news