ఎన్టీఆర్ 28.. కాంబో ఫిక్స్ అయ్యింది.. త్రివిక్రం, తారక్ సినిమా సెన్సేషన్..!

ntr-trivikram-movie

అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా ముహుర్తం పెట్టుకున్న సంగతి తెలిసిందే. మార్చిలో మొదలవనున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో కె. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె తో పాటుగా శ్రద్ధ కపూర్ కూడా హీరోయిన్ గా ఓకే చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుద్ ప్లేస్ లో తమన్ సెలెక్ట్ అవగా.. ఫైనల్ కాస్ట్ అండ్ క్రూ ఇదే అని మ్యాటర్ రివీల్ అయ్యింది. సాహోతో శ్రద్ధా కపూర్, డిజేతో పూజా ఇద్దరు క్రేజీగా మారనున్నారు. మరి ఈ ఇద్దరితో తారక్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఇయర్ దసరా కు ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం సత్తా చాటేలా ఈ సినిమా కథ, కథనాలను రచిస్తున్నారట. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment