Gossipsచరణ్ ఇంట్లో ఎన్టీఆర్ సర్ ప్రైజ్.. మెగా నందమూరి ఫ్యాన్స్ ఖుషి..!

చరణ్ ఇంట్లో ఎన్టీఆర్ సర్ ప్రైజ్.. మెగా నందమూరి ఫ్యాన్స్ ఖుషి..!

బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా తీస్తే అంచనాలు పెరుగుతాయో ఆలోచించి అలాంటి క్రేజీ మల్టీస్టారర్ నే తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి చేయబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా సందర్భంగా చరణ్, ఎన్.టి.ఆర్ స్నేహం మరింత బలం కానుంది. ఈ క్రమంలో రాం చరణ్ ఇంట్లో ఎన్.టి.ఆర్ దర్శనమిచ్చాడు.

ఉపాసన ఏర్పాటు చేసిన విస్తారుకుల క్రిస్ మస్ ట్రీ దగ్గర ఫోటో దిగిన తారక్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఎన్.టి.ఆర్ యూరప్ ట్రిప్ ముగించుకుని వచ్చాడన్న విషయం కూడా ఈ పిక్ తో రివీల్ అయ్యింది. ఇప్పటికే సిని పరిశ్రమకు సంబంధించిన కొంతమందిని క్రిస్ మస్ ట్రీ దగ్గర ఫోటోలు దిగి షేర్ చేసింది ఉపాసన. ఇప్పుడు ఎన్.టి.ఆర్ దిగిన ఫోటో చరణ్, ఎన్.టి.ఆర్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం చాటుతుంది.585f1e339168be7634e847c34ae95111

అభిమానుల మధ్య గొడవలే కాని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు అన్నది తారలు ప్రతి సందర్భంలో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అది గుర్తించని ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని దెబ్బలాడుతున్నారు. మొత్తానికి ఈ క్రిస్ మస్ సందర్భంగా ఉపాసన ఏర్పాటుచేసిన క్రిస్ మస్ ట్రీ మెగా నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేసింది.ram charan

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news