అన్నయ్యలో ఆ కష్టం చూస్తున్నా.. నా నువ్వే ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్..!

ntr-speech-naa-nuvve

కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర డైరక్షన్ లో వస్తున్న నా నువ్వే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. రెగ్యులర్ అన్ని సినిమాల్లా కాకుండా కళ్యాణ్ అన్న ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నారని. మూడేళ్ల క్రితం నాన్నకు ప్రేమతో సినిమా టైం లో తాను ఎలాంటి టెన్షన్ లో ఉన్నానో ఇప్పుడు కళ్యాణ్ అన్న అలా ఉన్నారని. కష్టం ఎప్పటికి వృధా కాదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రయోగాలను ఆదరిస్తారని అన్నారు ఎన్.టి.ఆర్.

ఇక దర్శకుడు జయేంద్ర ఇన్నాళ్లు తన అన్న కెరియర్ లో ఎన్నో సినిమాలు తీసినా ఇందులో కొత్తగా కనిపించేలా చేశారని అన్నారు. సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరి గురించి ప్రస్థావిస్తూ ఇలాంటి ప్రయోగం చేయాలన్నా ముందు నిర్మాతల నుండి ప్రోత్సాహం ఉండాలని విజయ్, కిరణ్, మహేష్ ఈ ముగ్గురు సినిమాకు మంచి ప్రోత్సాహం అందించారని అన్నారు.

ఇక కళ్యాణ్ అన్న సినిమా రిలీజ్ అయ్యాక ఈసారి గంట, రెండు గంటలు మాట్లాడుతానని అన్నారు.. అదే సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అని అన్నారు. ఓ ప్రయోగం సక్సెస్ అయితే ఆ హీరో ఇంకా అలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడతారని. రెగ్యులర్ సినిమాల నుండి తమని తాము కొత్తగా చూపించాలని ఈ సినిమాతో కళ్యాణ్ అన్న వేసిన స్టెప్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు ఎన్.టి.ఆర్.

Leave a comment