కొడుకు బారసాలకు ముఖ్య అతిధులు మెగా ఫ్యామిలీయేనా..?

ntr son name cermony details

నందమూరి కుటుంబంలో కొత్తగా వారసుడు వచ్చాడు. ఎన్.టి.ఆర్ కు రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. తనయుడి నేమింగ్ సెరిమనీకి అతిథులుగా సిని సెలబ్రిటీస్ ను పిలిచే ఆలోచనలో ఉన్నాడట తారక్. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబందించిన హీరోలు ఈ వేడుకలో విశిష్ట అతిథులుగా వస్తున్నారని తెలుస్తుంది.

మెగా హీరోల్లో రాం చరణ్ ఈ బారసాల కార్యక్రమానికి వస్తాడని తెలుస్తుండగా.. చరణ్ తో పాటుగా మిగతా హీరోలు వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు మహేష్ బాబు కూడా భార్గవ్ రామ్ నేమింగ్ సెరిమనీకి వస్తాడని తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు కూడా ఈ వేడుకకు వస్తారని అంటున్నారు. ఫంక్షన్ భారీగానే చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

Leave a comment