ఎన్టీఆర్ ఊహించని ట్విస్ట్.. త్రివిక్రం కంటే ముందు అతనితోనే

ntr

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జై లవ కుశతో సత్తా చాటగా తన తర్వాత సినిమా ఏదై ఉంటుందా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలైతే త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తెలిసినా దానికి కాస్త టైం పడుతుందని ఈలోగా దిల్ రాజు ప్రాజెక్ట్ సైన్ చేస్తున్నాడట తారక్. ఇక ఆ సినిమాకు ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.

టెంపర్ నుండి రెగ్యులర్ ఫార్మెట్ లకు దూరంగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న తారక్ జై లవ కుశతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక త్రివిక్రం సినిమా కోసం గ్యాప్ తీసుకున్నా సరే ఈలోగా మరో సినిమాకు ముహుర్తం పెట్టబోతున్నాడట. మరి తారక్ ను మెప్పించేలా కథ అందించిన కొత్త దర్శకుడు ఎవరు అన్న డిస్కషన్ మొదలైంది.

మొత్తానికి తారక్ హిట్ కొట్టిన కొత్త ఉత్సాహంతో కేవలం స్టార్ అన్న పంథాలో కాకుండా కథా బలమున్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు మరి రాబోతున్న ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.

 

Leave a comment