ఢీ10 లో ఎన్టీఆర్ సీన్స్ కట్..ఆగ్రహంలో ఫ్యాన్స్..!

3

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద మళ్లీ సందడి చేశాడు. ఢీ-10 గ్రాండ్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్.టి.ఆర్ రావడం జరిగింది. ఈటివి లో వస్తున్న ఈ డ్యాన్స్ షో అంటే బుల్లితెర అభిమానుల్లో భలే క్రేజ్ ఏర్పడింది. 10 సీజన్లుగా వస్తున్న ఈ డ్యాన్స్ షో పై స్టార్స్ కూడా ఓ కన్నేస్తారు. ఈ షో నుండి ఎంతోమంది టాలెంటెడ్ డ్యాన్సర్స్ బయటకు వస్తున్నారు.

ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చిన ఈ పిక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈరోజు ప్రసారం కానున్న ఈ షోలో ఎన్.టి.ఆర్ సీన్స్ కొన్ని కట్ చేసినట్టు తెలుస్తుంది. షో మొత్తం ఎన్.టి.ఆర్ నిండిపోయాడట. అందుకే ఎన్.టి.ఆర్ సీన్స్ లో కొన్నిటికి కత్తెరవేయక తప్పలేదట.

ఇక ఈ సీజన్ ఫైనల్ విన్నర్ గా రాజు విన్ అవడం జరిగింది. చిట్టి డ్యాన్స్ మాస్టర్ కంటెస్టంట్ అయిన రాజు మొదటి నుండి తన డ్యాన్సింగ్ టాలెంట్ తో ఆకట్టుకుంటున్నాడు.

Leave a comment