Gossipsవీర రాఘవ ఒక్కడా ఇద్దరా.. ఎన్.టి.ఆర్ దమ్ము చూపిస్తాడా..!

వీర రాఘవ ఒక్కడా ఇద్దరా.. ఎన్.టి.ఆర్ దమ్ము చూపిస్తాడా..!

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సిక్స్ ప్యాక్ తో సంచలనంగా మారిన ఈ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తాడని తెలుస్తుంది.

కేవలం రెండు షేడ్స్ మాత్రమేనా లేదంటే తారక్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడా అన్న డౌట్ కూడా మొదలైంది. వీర రాఘవ ఒక్కడా ఇద్దరా అన్నది అభిమానుల ప్రశ్న. అరవింద సమేత వీర రాఘవ లో వీర రాఘవకి గ్యాప్ ఎక్కువ ఇచ్చారు. అందుకే వీర రాఘవ ఒక్కడు కాదు ఇద్దరని ఫిక్స్ అవుతున్నారు. ఒకరేమో రాయలసీమలో ఆ మాండలికంతో మాట్లాడేలా కనిపిస్తాడట. మరొకరు హైదరాబాద్ యంగ్ గాయ్ గా చూపిస్తారట.

మొత్తానికి త్రివిక్రం, తారక్ క్రేజీ కాంబినేషన్ అంచనాలకు తగినట్టుగానే సినిమా తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఈషా రెబ్బ నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news